మొత్తానికి కోహ్లీ ఒక మ్యాచ్ గెలిచాడు
విభాగం : క్రీడ వార్తలు
finally-kohli-won-one-match_kuwait

ఈ ఐపీఎల్‌లో ఆరు మ్యాచుల్లో ఒక్కటీ గెలిపించలేకపోయిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చిట్టచివరికి ఏడో మ్యాచ్‌ను గెలిపించాడు. దీంతో ప్రపంచకప్ ముందు టీమిండియా కెప్టెన్ పై ముసురుకున్న నీలినీడలు కొంతవరకు తొలగినట్లయ్యాయి. ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న కోహ్లీ ఆరు మ్యాచుల్లో ఒక్కటీ గెలవకపోవడంతో దేశమంతటా కోహ్లీ కెప్టెన్సీపై సందేహాలు మొదలవడమే కాకుండా ప్రపంచకప్ ముందు ఇదంతా చెడు సంకేతంగా భావిస్తూ వచ్చారు. కోహ్లీ కూడా తీవ్ర నిరాశ, ఆత్మవిశ్వాస లేమితో కనిపించాడు. 

ఈ ఏడో మ్యాచ్‌ను కింగ్స్ లెవన్ పంజాబ్‌పై గెలవడంతో కోహ్లీ మళ్లీ ఆత్మవిశ్వాసం సంతరించుకునే అవకాశం ఉంది. కోహ్లీ ఈమ్యాచ్‌లో తాను స్వయంగా 67 పరుగులు చేయడంతో మళ్లీ కోహ్లీ బ్యాట్స్‌మన్‌గా, కెప్టెన్‌గా కూడా ఫాంలోకి వచ్చినట్లయింది.

విరాట్‌ కోహ్లీ ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడుగా అందరి మన్ననలు అందుకుంటున్న వ్యక్తి. కానీ, ఐపీఎల్‌లో వరుస పరాజయాలు ఒక్కసారిగా ఆయన గ్రాఫ్‌ను కిందకు జార్చేశాయి. 

టీమిండియా కెప్టెన్‌గా ఎన్నో విజయాలు అందించినా  ఐపీఎల్‌లో విరాట్ విజయాల శాతం తక్కువే. ఐపీఎల్‌లో 100 మ్యాచ్‌లకు పైగా సారథ్యం వహించిన ముగ్గురిలో ఒకరైన కోహ్లీ రాయల్ చాలెంజర్స్‌కు ఒక్కసారీ ట్రోఫీ అందించలేకపోయాడు.  విరాట్‌ సారథ్యంలో జట్టు విజయాల శాతమూ తక్కువే. ఈసారి పరిస్థితి మరీ దారుణంగా మారిపోయింది. తాజా విజయం తరువాత ఆయన పుంజుకుంటే ప్రపంచ్ కప్‌లో భారత్‌కు అది ఉపయోగపడుతుంది.

 

SOURCE : GULTE

14 Apr, 2019 0 65
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
రాజకీయ వార్తలు సినిమా వార్తలు క్రీడ వార్తలు వ్యాసాలు