కుక్కతో విశాల్ సినిమా
విభాగం: సినిమా వార్తలు
vishal-planning-a-movie-with-dog_kuwait

ఈ మధ్యే రవిబాబు పంది పిల్లను హీరోగా పెట్టి తీసిన ‘అదుగో’ సినిమా రిలీజైంది. ఈ చిత్రం పేలవమైన టాక్ తెచ్చుకుని డిజాస్టర్ అయింది. కాకపోతే ఇండియాలో పంది పిల్లను హీరోగా పెట్టి సినిమా తీసిన తొలి దర్శకుడిగా రవిబాబు రికార్డులెక్కాడు. 

నిజానికి రవిబాబుకు దర్శకుడిగా ఉన్న ఇమేజ్ ప్రకారం చూస్తే.. పంది పిల్ల హీరోగా సినిమా అంటే ఏదో ఒక ప్రత్యేకత చూపించి ఉంటాడని, చక్కటి వినోదం పంచుతాడని జనాలు ఆశించారు. కానీ అంచనాల్ని అందుకోవడంలో అతను ఘోరంగా విఫలమయ్యాడు. ఇదిలా ఉంటే.. రవిబాబు లాగే నటన నుంచి దర్శకత్వంలోకి అడుగు పెట్టబోతున్న ఒక హీరో ఓ కుక్కను కథానాయకుడిగా పెట్టి సినిమా తీయబోతున్నట్లు వస్తున్న వార్తలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఆ హీరో మరెవరో కాదు.. తమిళంలో పెద్ద స్టార్‌గా ఎదిగిన తెలుగోడు విశాల్.

హీరో కావడానికి ముందే దర్శకత్వ శాఖలో పని చేసిన విశాల్.. తాను కూడా దర్శకుడినవుతానని చాలా కాలంగా చెబుతున్నాడు. ఈ మధ్య ఇంకొంచెం గట్టిగా ఇదే విషయాన్ని నొక్కి వక్కాణించాడు. జనాలు ఈ విషయాన్ని లైట్ తీసుకునే అవకాశం ఇవ్వకుండా అతను తన దర్శకత్వ అరంగేట్రానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడట. అతను ఒక కుక్కను హీరోగా పెట్టి సినిమా తీస్తాడట. ఇందులో సీనియర్ హీరోయిన్ త్రిష ఓ కీలక పాత్ర పోషించనున్నట్లు సమాచారం. ఆమె నిజ జీవితంలో జంతు ప్రేమికురాలు.. పెటా ప్రచారకర్త అన్న సంగతి తెలిసిందే. 

విశాల్ సొంత నిర్మాణ సంస్థలో ఈ చిత్రం తెరకెక్కుతుందట. విశాల్‌కు హీరోగా ఉన్న ఇమేజ్ ప్రకారం తనే హీరోగా మాంచి కమర్షియల్ సినిమా తీస్తాడని అనుకుంటాం. కానీ అతను మాత్రం భిన్నంగా ఆలోచిస్తున్నట్లున్నాడు. విశాల్ సినిమాలో కుక్క హీరో అనగానే జనాల్లో ఒక క్యూరియాసిటీ రావడం ఖాయం. మరి ఆ క్యూరియాసిటీకి తగ్గట్లే సినిమా ఉంటుందేమో చూడాలి. వచ్చే ఏడాదే ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్తుందట.


 

 

 

 

SOURCE:GULTE.COM

11 Nov, 2018 0 87
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
రాజకీయ వార్తలు సినిమా వార్తలు క్రీడ వార్తలు వ్యాసాలు