అక్కినేని, దాసరి,హరికృష్ణ విగ్రహాల తొలగింపు
విభాగం: సినిమా వార్తలు
visakhapatnam-corporation-officials-remove-the-harikrishna,akkineni,dasari-statues-from-beach-road_kuwait

తాజాగా చోటు చేసుకున్న పరిణామం ప్రముఖల కుటుంబాల వారికి ఒక గుణపాఠంగా మారాల్సిన అవసరం ఉంది. అంతేకాదు.. అభిమానం పేరుతో ఇష్టారాజ్యంగా వ్యవహరించటానికి వీల్లేదన్న సందేశం ప్రజలకు చేరే అవకాశం ఉంది. అయితే.. ఈ మొత్తం ఎపిసోడ్ లో తమకు సంబంధం లేకున్నా.. తమ పేరు మీద జరిగే వాటిపై ప్రముఖుల ఆత్మలు ఇబ్బంది పడొచ్చేమో కానీ.. ఎక్కడో అక్కడ మార్పు మొదలు కావాల్సిన అవసరం ఉంది.

 

టాలీవుడ్ పరిశ్రమలో చిత్ర ప్రముఖులుగా పేరున్న స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు.. దర్శకరత్న దాసరి నారాయణల విగ్రహాల్ని తొలగింపు చర్య ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వీరి విగ్రహాలతో పాటు.. ఎన్టీఆర్ తనయుడు.. ఈ మధ్యనే రోడ్డు ప్రమాదంలో మరణించిన హరికృష్ణ విగ్రహాన్ని తొలగించారు విశాఖ మున్సిపల్ అధికారులు.

గత ఏడాది డిసెంబరు మొదటివారంలో మంత్రి గంటా శ్రీనివాసరావు.. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ నేతృత్వంలో అక్కినేని.. దాసరి.. హరికృష్ణ విగ్రహాల్ని బీచ్ రోడ్ లో ఏర్పాటు చేశారు. విగ్రహాల ఏర్పాటు కోసం జీవీఎంసీ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదు.

దీంతో.. ఈ విగ్రహాల ఏర్పాటుపై అభ్యంతరం చేసిన ప్రజాసంఘాలు కోర్టును ఆశ్రయించాయి. దీనిపై విచారణ జరిపిన కోర్టులు.. విగ్రహాల్ని తొలగించాలని తీర్పు ఇచ్చింది. దీంతో.. పోలీసు బందోబస్త్ నడుమ మూడు విగ్రహాల్ని తొలగించారు. చేతిలో పవర్ ఉంది కదా అని ఇష్టారాజ్యంగా విగ్రహాల ఏర్పాటు సరైన పద్దతి కాదు. విగ్రహాల ఏర్పాటుపై విధివిధానాల్ని పక్కాగా ఫాలో కావాల్సిన అవసరం ఉంది. అప్పుడే అనవసరమైన ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా ఉంటాయి.  

 

SOURCE : TUPAKI

14 May, 2019 0 45
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
రాజకీయ వార్తలు సినిమా వార్తలు క్రీడ వార్తలు వ్యాసాలు