ట్రైలర్ టాక్-ఫకీర్ జర్నీలో ట్విస్టులే ట్విస్టులు
విభాగం: సినిమా వార్తలు
trailer-talk-many-twists-in-fakir-journey_kuwait

తమిళ స్టార్ ధనుష్ తొలిసారిగా 'ది ఎక్స్ ట్రా ఆర్డినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్' అనే హాలీవుడ్ చిత్రంలో నటిస్తున్నాడు.  రొమెయిన్ ప్యూర్టోలాస్ రాసిన 'ది ఎక్స్ ట్రా ఆర్డినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్ హూ గాట్ ట్రాప్డ్ ఇన్ ఐకియా వార్డ్ రోబ్' అనే పుస్తకం ఆధారంగా తెరకెక్కింది.  కెన్ స్కాట్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఇప్పటికే అంతర్జాతీయంగా విడుదల చేసినప్పటికీ ఇండియా లో మాత్రం జూన్ 21 న రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైనర్ ను విడుదల చేశారు.

 

ముంబైలో పుట్టి పెరిగిన ఒక పేదింటి అబ్బాయి అయిన అజాత శత్రు పటేల్ కి పేదరికం అంటే నచ్చదు. ఎలాగైనా డబ్బు సంపాదించాలని రకరకాల ట్రిక్స్ ప్లే చేస్తుంటాడు. మ్యాజిక్ కూడా నేర్చుకుంటాడు. ప్యారిస్ కు వెళ్లి అక్కడ బిగ్ షాట్ అవుదామనే కలలు కంటాడు. అక్కడ కూడా అంతా గజిబిజే. ఎందుకంటే ఫేక్ 100 యూరోస్ తో తన ప్రయాణం మొదలు పెడతాడు.  అక్కడి నుంచి ఇంగ్లాండ్ కు వెళ్తాడు. అక్కడ పోలీసుల చేతికి చిక్కుతాడు.  ఇలా ఎన్నో ట్విస్టులతో టర్న్ లతో సాగుతుంది ధనుష్ జర్నీ. ఈ చిత్రాన్ని ఇండియా.. ఫ్రాన్స్.. ఇటలీ.. లిబియాలోని పలు లోకేషన్స్ లో చిత్రీకరణ జరిపారు.

ఓవరాల్ గా ట్రైలర్ అంతా ఫన్నీగా ఇంట్రెస్టింగ్ గా సాగింది. ప్యారిస్.. లండన్ నేపథ్యంలో కథ సాగడంతో కొత్తగా అనిపిస్తోంది.   ధనుష్ కూడా తన పాత్రకు తగ్గట్టే చక్కగా నటించాడు.  ఇంకా ఆలస్యం ఎందుకు ఈ ఫకీర్ పై ఒక లుక్కెయ్యండి.

 

SOURCE : TUPAKI

05 Jun, 2019 0 29
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
రాజకీయ వార్తలు సినిమా వార్తలు క్రీడ వార్తలు వ్యాసాలు