ఆర్టిస్టులకు రూ 4000 తెలంగాణ ప్రభుత్వ పెన్షన్
విభాగం: సినిమా వార్తలు
telangana-govt-gives-pension-to-4000-stage-artists_kuwait

మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) పెన్షన్ స్కీమ్స్ గురించి తెలిసిందే. తమ సంఘంలో సభ్యులైన 800 మందిలో ఎంపిక చేసిన కొందరు వృద్ధ పేద కళాకారులకు నెలకు రూ.5000 పెన్షన్ ఇస్తున్న సంగతి తెలిసిందే. హెల్త్ కార్డులు సహా రకరకాల సంక్షేమ పథకాల్ని ఆర్టిస్టులకు అందించే దిశగా చర్యలు చేపడుతోంది. అందుకోసం అవసరం మేర నిధి సేకరణ కార్యక్రమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆర్టిస్టులకు పెన్షన్ స్కీమ్ ఈ రెండు దశాబ్ధాల్లో రూ.1000 నుంచి ఇప్పటికి రూ.5000 వరకూ పెరగడం చాలా గొప్ప పరిణామం అంటూ ఆర్టిస్టులంతా ఎంతో సంతోషించారు.

 

అయితే మూవీ ఆర్టిస్టుల సంఘంలో ఉన్నవారికి మాత్రమే ఈ పెన్షన్ స్కీమ్ వర్తిస్తుంది. మరి టాలీవుడ్ పై ఆధారపడి జీవించే వేలాది మంది ప్రతిభావంతులైన పేద ఆర్టిస్టులకు పెన్షన్ ఎలా? వీళ్లలో రంగస్థలం నుంచి వచ్చిన వాళ్లు కూడా ఉన్నారు. జీవితం ముగుస్తున్నా ఇండస్ట్రీలో బ్రేక్ రాక కుటుంబం పస్తులతో ఉండే దారుణ సన్నివేశం ఉంటుంది కొందరికి. నటించడం .. పద్యాలు పాడడం తప్ప వేరొక విద్య తెలియని రంగస్థల కళాకారులను ఆదుకునేందుకు కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాల వద్ద ఓ స్కీమ్ ఉన్న సంగతి తెలిసింది తక్కువ మందికే. భారత కేంద్ర సాంస్కృతిక శాఖలో వృద్ధ కళాకారుల కోసం ప్రత్యేకించి ఓ పెన్షన్ స్కీమ్ ఉంది. దానికోసం ప్రత్యేకించి ఓ నిధిని కూడా కేటాయించారని కొందరు అవేర్ నెస్ ఉన్న వాళ్లు చెబుతుంటారు. రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ నుంచి సైతం ప్రతియేటా నోటిఫికేషన్ వెలువడుతుందని ఓ సమాచారం ఉంది.

తాజాగా వృద్ధ కళాకారుల పెన్షన్ & హెల్త్ స్కీమ్ కి సంబంధించిన దరఖాస్తులకు కేంద్ర సాంస్కృతిక శాఖ  పిలుపునిచ్చింది. రాష్ట్ర/ కేంద్ర స్థాయి పురస్కార గ్రహీతలకు.. రంగస్థల/ఆకాశవాణి/దూరదర్శన్ లలో గుర్తింపు పొంది విశిష్ట సేవలందించిన సీనియర్ కళాకారులకు (60 సంవత్సరాల  వయస్సు దాటినవారు) 48000/- రూపాయల వార్షిక ఆదాయం మించని కళాకారులకు పెన్షన్ & వైద్యసేవా పథకం క్రింద నెలకు 4 వేల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించింది. అలాగే కళాకారులకు ఉచిత వైద్యసేవలు ప్రభుత్వమే అందించనుందని ప్రకటించింది. అర్హులైన సీనియర్ కళాకారులు అవసరమైన సర్టిఫికెట్లు జతపరచి దరఖాస్తులు పంపి ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరని ప్రభుత్వం ఓ ప్రకటనలో కోరింది. తెలుగు సినీపరిశ్రమలో ఎందరో రంగస్థల కళాకారులు ఉపాధి పొందుతున్నారు. ఇందులో వృద్ధులు ఉన్నారు. ఇలాంటి వారికి ఈ స్కీమ్ కి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ లోనూ అప్లికేషన్ సహా అవసరమైన సమాచారం అందుబాటులో ఉంది.

 

SOURCE : TUPAKI

09 May, 2019 0 43
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
రాజకీయ వార్తలు సినిమా వార్తలు క్రీడ వార్తలు వ్యాసాలు