శ్రీ ఎస్ పి వై రెడ్డి ఆశయాలు కొనసాగిస్తాం - శ్రీ ప‌వ‌న్ క‌ళ్యాణ్
విభాగం: రాజకీయ వార్తలు
sri-spy-reddys-ambitions-will-continue---sri-pawan-kalyan_kuwait

దుర‌దృష్ట‌వ‌శాత్తు ఎస్పీవై రెడ్డి గారు మ‌న మ‌ధ్య లేక‌పోయినా ఆయ‌న ఆశ‌యాలను కొన‌సాగిస్తామ‌ని జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షులు శ్రీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారు స్ప‌ష్టం చేశారు.

 

15 ఏళ్లుగా ఆయ‌న‌తో అనుబంధం ఉంద‌ని, ఆయ‌న వ్య‌క్తిత్వం బాగా నచ్చిందని చెప్పారు. ఆయన ఏ పార్టీలో ఉన్నా అందరికీ సుపరిచిత వ్యక్తే అన్నారు. నంద్యాల లోక్ సభ స్థానం నుంచి శ్రీ ఎస్పీవై రెడ్డి జనసేన అభ్యర్థిగా పోటీ చేశారు. అనారోగ్యంతో బాధ‌ప‌డుతూ కొద్దిరోజుల కింద‌ట క‌న్నుమూశారు. శ్రీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారు శ‌నివారం నంద్యాలలో ఎస్పీవై రెడ్డి కుటుంబాన్ని ప‌రామ‌ర్శించారు. శ్రీ ఎస్పీవై రెడ్డి మృతి ప‌ట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఇంటి ఆవ‌ర‌ణ‌లో ఉన్న ఎస్పీవై రెడ్డి స‌మాధి వ‌ద్ద పూల‌మాల వేసి నివాళులు అర్పించారు. అనంత‌రం శ్రీ ఎస్పీవై రెడ్డి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా శ్రీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారు మాట్లాడుతూ ప్ర‌జా సంక్షేమ కార్య‌క్ర‌మాల్లో ఎస్పీవై రెడ్డి గారు త‌నదైన ముద్ర వేశారు.

ఒక్క రూపాయికి పప్పు, రొట్టె, ఒక్క రూపాయికి మజ్జిగ, ఒక్క రూపాయి అద్దెతో సాగునీటి సరఫరాకు పీవీసీ పైపు, బిందు సేద్యానికి సగం ధరకే సామగ్రి అందించడం మామూలు విష‌యం కాద‌న్నారు. ఒక పారిశ్రామికవేత్త అలా చేయ‌డం గొప్ప విష‌య‌మ‌న్నారు. అందుకే ఆయ‌న రైతు ప‌క్ష‌పాతిగా ప్ర‌జ‌ల మ‌న‌సుల్లో ఆయ‌న చెర‌గ‌ని ముద్ర వేశార‌ని, ఆయ‌న ఆశ‌యాల‌ను ముందుకు తీసుకెళ్తామ‌న్నారు. ఎస్పీవై రెడ్డి గారి కుటుంబానికి జ‌న‌సేన పార్టీ అన్ని విధాల అండ‌గా ఉంటుంద‌ని, వారిని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటుంద‌ని భ‌రోసా ఇచ్చారు. ఈ కార్య‌క్ర‌మంలో పార్టీ ముఖ్య‌నేత‌లు శ్రీ నాదెండ్ల మ‌నోహ‌ర్ , శ్రీ మాదాసు గంగాధ‌రం, శ్రీ పి.రామ్మోహ‌న్ రావుతోపాటు క‌ర్నూలు జిల్లా జ‌న‌సేన నేత‌లు పాల్గొన్నారు.

13 May, 2019 0 43
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
రాజకీయ వార్తలు సినిమా వార్తలు క్రీడ వార్తలు వ్యాసాలు