పవన్ కళ్యాణ్ ,అతనొక అజేయ సైనికుడు ,జనసైనికుడు
విభాగం: రాజకీయ వార్తలు
special-article-on-pawankalyan_kuwait

న్యూస్ ఆఫ్ 9 ప్రత్యేక కథనం

‘‘ఆయన గాయపడిన సింహం… మే 23 ఫలితాలు చూడండి’’ ఈ మాట అన్నది ఎవరో కాదు… ఎంతో పరిణతి ఉన్న ఎస్పీవై రెడ్డిగారు. అవును… పవన్ కళ్యాణ్ గాయపడిన సింహం.

సొంత మనుషుల బలహీనతలను ఆసరాగా చేసుకుని ఆధిపత్య వర్గాలు రెండూ కలిసిపోయి ప్రజారాజ్యం పార్టీని వెన్నుపోటు పొడిచాయి. కమ్మసామాజిక వర్గం చివరి క్షణంలో టిక్కెట్లు అమ్ముకున్నారని ప్రచారం చెయ్యగా, సొంత మనుషులను వలలో వేసుకుని ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో కలిపివెయ్యడంలో మరో వర్గం విజయం సాధించింది. పోయిన చోటే మళ్లీ వెదుక్కోవాలి. అది వీరుల లక్షణం. సమాజానికి మేలు చేద్దామని వచ్చిన మెగాస్టార్ చిరంజీవిని అశక్తుడిని చేయడంలో ఈ సమాజం విజయం సాధించింది. అది తాత్కాలికమే… అని నిరూపించదలచుకున్నాడు ఒక తమ్ముడు. పేరు పవన్ కళ్యాణ్.

చిరంజీవి తమ్ముడే కదా పవన్ కళ్యాణ్.. ఆ ఆఫ్టరాల్ అనుకున్నారు. కానీ ఆయన మనసులో వెన్నుపోటు రగిలించిన అగ్గి కణకణమంటూ మండుతూనే ఉన్నది. నమ్మిన వారినే అక్కున చేర్చుకున్నాడు. ప్రపంచంలోని రాజకీయ సిద్ధాంతాలన్నీ చదువుకున్నాడు. రాజకీయాల్ని క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు. సలహాలు చెబుతామంటూ పంచన చేరే ప్రయత్నాలు జరిగాయి. వారికి గేట్లు మూసేశాడు. 2009 నాటి ‘‘మెగా’’ అన్యాయం గురించి మెగా బ్రదర్స్ కంటే ఎక్కువగా బాధపడేవాళ్లు ఎవరుంటారు?

నీవు నేర్పిన విద్యయే…

90 శాతం కులాలు రాజకీయ అధికారానికి ఆమడ దూరంలో ఉన్నాయి. ‘‘సామాజిక న్యాయం’’… ఒక ప్రణాళిక ప్రకారమే జనసేన పార్టీని నడిపించాడు. 21వ శతాబ్దంలో యువత సంఖ్యే ఎక్కువ. వారి భాషలోనే మాట్లాడాడు. వారి బాధల్ని స్వయంగా పంచుకున్నాడు. ప్రశ్నించేవాడు లేకపోతే మరో 100 ఏళ్లు సమాజం ఇలానే ఉంటుందని, డబ్బున్న వర్గాల ఆధిపత్యాన్ని బద్ధలు కొట్టేయాలని సంకల్పం పెట్టుకున్నాడు. వ్యూహాత్మకంగానే 2014లో తెలుగుదేశానికి ఒక అవకాశం ఇచ్చాడు. దానిని తెలుగుదేశం సద్వినియోగం చేసుకుని ఉండాల్సింది. కానీ అది దాని సహజ లక్షణాలను మార్చుకోలేదు. ఎప్పటిలాగానే పార్టీకి చెందిన పెట్టుబడిదారులకు కొమ్ము కాసింది. కొత్త రాజధాని రూపంలో వారికి డబ్బులు మాత్రమే కనిపించాయి. కోట్లు కుమ్మేసుకున్నారు. ‘‘తెలుగుదేశం అవినీతికి పాల్పడుతుందని నాకు తెలియకేమీ కాదు’’ అని పవన్ కళ్యాణ్ ఒక సభలో చెప్పాడు. తప్పు చేసేవాడిని నాలుగు తన్నాలంటే… వాడు తప్పు చేస్తున్నాడని అందరి ముందూ నిరూపించాలి.

13 Apr, 2019 0 54
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
రాజకీయ వార్తలు సినిమా వార్తలు క్రీడ వార్తలు వ్యాసాలు