ఎన్టీఆర్‌ గురించిన పుకార్లు నిజమే
విభాగం: సినిమా వార్తలు
rumours-about-ntr-are-true_kuwait

'ఆర్‌ ఆర్‌ ఆర్‌' చిత్రంలో ఎన్టీఆర్‌ మహా బలుడి తరహాలో పెద్ద పెద్ద కండలతో కనిపించబోతున్నాడని జరిగిన ప్రచారం నిజమేనని ఓపెనింగ్‌లో అతడిని చూస్తేనే తెలిసిపోయింది. అరవింద సమేతలో సిక్స్‌ ప్యాక్‌తో స్లిమ్‌గా కనిపించిన తారక్‌ ఈ చిత్రం ఆరంభోత్సవంలో పెద్ద పెద్ద జబ్బలు, ఉబ్బిన బుగ్గలు, భారీ ఆకారంతో దర్శనమిచ్చాడు. ఎన్టీఆర్‌ని ఎప్పుడూ చూడని రీతిన అతని ట్రెయినర్‌ ఈ చిత్రానికి తీర్చిదిద్దుతున్నాడు. 

చరణ్‌ ఇంకా 'వినయ విధేయ రామ' లుక్‌ మెయింటైన్‌ చేస్తున్నాడు. కానీ ఎన్టీఆర్‌ మాత్రం అభిమానులు సైతం ఆశ్చర్యపోయేలా కనిపిస్తున్నాడు. ఎన్టీఆర్‌ ఈ ఫిజిక్‌పై వర్క్‌ చేయడం మొదలు పెట్టి కొద్ది రోజులే అవుతోంది. ఈలోగానే అతనిలో చాలా మార్పు వచ్చేసింది. ఇది ఇంకా పూర్తి వాలకం కాదని, అతని ఫుల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ అయ్యాక మైండ్‌ పోతుందని స్కెచ్‌లు చూసిన వారు చెబుతున్నారు. 

అయితే పుకార్లలో వినిపిస్తోన్నట్టుగా ఎన్టీఆర్‌ నిజంగా ఇందులో విలన్‌గా కనిపించబోతున్నాడా? చరిత్ర చూడని అతి పెద్ద విలన్‌ని రాజమౌళి నిజంగానే ఆవిష్కరిస్తున్నాడా? లేక ముందుగా ప్రచారం జరిగినట్టుగా ఎన్టీఆర్‌ బాక్సర్‌ వేషం కోసం ఈ లుక్‌ మీద వర్క్‌ చేస్తున్నాడా? ఏదేమైనా మిగతాదంతా ఎలా వున్నా ఎన్టీఆర్‌ లుక్‌ మాత్రం ఈ చిత్రం ఆరంభోత్సవంలో హాట్‌ టాపిక్‌గా మారింది.

 

 

 

SOURCE:GULTE.COM

11 Nov, 2018 0 105
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
రాజకీయ వార్తలు సినిమా వార్తలు క్రీడ వార్తలు వ్యాసాలు