రాజమౌళి చెప్పిందే వేదం
విభాగం: సినిమా వార్తలు
ntr-and-charan-just-following-directions-of-rajamouli-for-rrr_kuwait

ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ ఇద్దరికీ లక్షలాది అభిమానులు వుండొచ్చు. వారు సూపర్‌స్టార్స్‌ అయి వుండొచ్చు కానీ వీరిద్దరూ కలిసి నటిస్తోన్న చిత్రానికి రాజమౌళినే సూపర్‌ పవర్‌. రాజమౌళి చిత్రం చేయడం వల్ల నటులుగా తమకి ఈ టైమ్‌లో ఎంత అడ్వాంటేజ్‌ అనేది ఇద్దరికీ తెలుసు. అందుకే రాజమౌళి తీస్తోన్న 'ఆర్‌ఆర్‌ఆర్‌' చిత్రం గురించి ఇరు హీరోల నుంచి ఎలాంటి ప్రశ్నలు, అనుమానాలు లేవు. రాజమౌళి ఎప్పుడంటే అప్పుడు సెట్‌లో హాజరు కావడమే. చివరకు ఇద్దరికీ పారితోషికం కూడా లేదు... లాభాల్లో వాటా మాత్రమే. ఈ చిత్రాన్ని ఇద్దరూ కూడా లాభాపేక్షతో చేయడం లేదు. 

తమ ఇమేజ్‌ని పదింతలు చేసి, ఇప్పుడున్న మార్కెట్‌ని రెండింతలు చేస్తుందని మాత్రమే చేస్తున్నారు. అలాగే ఈ చిత్ర నిర్మాత దానయ్య కూడా పేరుకి మాత్రమే నిర్మాత అట. రాజమౌళి అడిగిన వనరులు సమకూర్చడం మినహా అతను చేసేదేమీ వుండదు. రాజమౌళి ఏమి తీస్తాడో, ఎక్కడ తీస్తున్నాడో కూడా అతడికి ఐడియా వుండదు. ఈ చిత్రానికి సంబంధించి కర్త కర్మ క్రియ అన్నీ రాజమౌళినే అని, ప్రస్తుతం అతనికి వున్న పాన్‌ ఇండియా మార్కెట్‌కి, బాహుబలితో వచ్చిన గుర్తింపుకి కావాలనుకుంటే ఏ బాలీవుడ్‌ హీరోలతోనో ఈ మల్టీస్టారర్‌ సెట్‌ చేసి వుండేవాడు. కానీ ఈ ఇద్దరు హీరోలని తానే ఎంచుకుని ఈ చిత్రానికి శ్రీకారం చుట్టాడు. ఎప్పుడో రాజమౌళికి అడ్వాన్స్‌ ఇచ్చి వున్న కారణంతో దానయ్య అదృష్టం కొద్దీ ఈ జాక్‌పాట్‌ కొట్టేసాడు.

 

 

 

SOURCE:GULTE.COM

10 Nov, 2018 0 79
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
రాజకీయ వార్తలు సినిమా వార్తలు క్రీడ వార్తలు వ్యాసాలు