మోడీ సినిమా కు షాక్ ఇచ్చిన ఈసీ
విభాగం: సినిమా వార్తలు
modi-biopic-stopped-by-ec_kuwait

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జీవితం ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ ‘పిఎం నరేంద్ర మోదీ’ఎన్నికల సమయంలో విడుదలవుతుండడంతో ఈ సినిమా విడుదలను ఆపాలంటూ కాంగ్రెస్ పార్టీ ఇటీవల కోర్టు ను ఆశ్రయించింది. అయితే కాంగ్రెస్ వాదనలు పట్టించుకోకుండా కోర్టు సినిమా విడుదలను ఆపడం కుదురదని తేల్చి చెప్పింది. అయితే ఎన్నికల సీజన్ కావడంతో ఎలక్షన్ కమిషన్ సినిమా విడుదలను అడ్డుకుంది. దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు ముగిసాక సినిమా ను విడుదల చేసుకోవాలని చిత్ర నిర్మాతలు కు సూచించింది. దాంతో ఏప్రిల్ 11న విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదాపడింది.

‘సరబ్జిత్ , మేరీ కోమ్’ బయోపిక్ ల దర్శకుడు ఒమంగ్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ , మోదీ పాత్రలో నటించాడు. సురేష్ ఒబెరాయ్ , సందీప్ సింగ్ ,ఆనంద్ పండిట్ ,ఆచార్య మనీష్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

 

SOURCE : 123TELUGU

10 Apr, 2019 0 33
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
రాజకీయ వార్తలు సినిమా వార్తలు క్రీడ వార్తలు వ్యాసాలు