మరో ఎన్నికకు కేసీఆర్ రెడీ,నేడో రేపో ముహుర్తం
విభాగం: రాజకీయ వార్తలు
kcr-ready-for-another-election_kuwait

తెలంగాణలో వరుస ఎన్నికల సందడి కొనసాగుతోంది. ముందస్తు ఎన్నికలు ముగిసిన వెంటనే వచ్చిపడిన పార్లమెంటు షెడ్యూల్లో కీలక ఘట్టమైన పోలింగ్ ఘట్టం ముగిసిన వెంటనే మరో ఎన్నికల సందడి తెరమీదకు వస్తోంది. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలు ముగియడంతో ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే జిల్లా మండల పరిషత్‌ , మున్సిపల్‌‌‌‌ ఎన్నికలను లోక్ సభ ఎన్నికల కోడ్‌‌‌‌ ముగిసే లోపు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌‌‌‌ను కోరింది. పరిషత్ ఎన్నికలకు ఈసీ గ్రీన్‌‌‌‌ సిగ్నల్‌‌‌‌ ఇవ్వగా.. మున్సిపల్‌‌‌‌ ఎన్నికలకు త్వరలోనే అనుమతి ఇచ్చే అవకాశం ఉంది.

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు తెరమీదకు వచ్చేందుకు పలు కారణాలను పేర్కొంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో  గత ఏడాది సెప్టెంబర్‌‌‌‌ నుంచి వరుసగా కోడ్ అమలులో ఉంటోంది. తద్వారా, పాలనకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సెప్టెంబర్ 6 నుంచి రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. అనంతరం పంచాయతీ ఎన్నికల కోడ్,  ఆ వెంటనే లోక్ సభ ఎన్నికల కోడ్ .. ఇలా వరుసగా కోడ్ లు వస్తూనే ఉన్నాయి. కోడ్ వల్ల పాలనపరమైన కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రజల్లో అసహనం సైతం వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్న వివిధ ఎన్నికలపై దృష్టి సారించింది. 

లోక్ సభ ఎన్ని కల కోడ్ గిసే లోపు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలని ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌‌‌‌ను కోరింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌‌‌‌ జిల్లా, మండల పరిషత్‌ ఎన్నికలు మే 20లోగా పూర్తిచేసేందుకు అనుమతినివ్వాలని కోరుతూ మార్చి13, 22 తేదీల్లో కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌‌‌‌కు లేఖ రాసింది. పరిషత్‌ ఎన్నికలకు సీఈసీ అనుమతినిచ్చింది. లోక్ సభ ఎన్నికల కోడ్‌‌‌‌ ముగిసి న తర్వాతేఫలితాలు వెల్లడించాలని స్పష్టం చేసింది. మున్సిపల్ఎన్ని కలకు త్వరలోనే అనుమతి లభించే అవకాశంఉంది. మున్సి‘పోల్స్’ను మే చివరిలోపు నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. మున్సిపల్‌‌‌‌ పాలకవర్గాల పదవీకాలం జూన్‌‌‌‌తో ముగియనుంది. ఈలోగా ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు సన్నాహాలు సిద్ధం చేస్తోంది. 

ఈ నెల 13, 14 తేదీల్లో జిల్లా,  మండల పరిషత్‌ ఎన్నికల రిటర్నింగ్‌‌‌‌ అధికారులకు రాష్ట్ర ఎన్నికల సంఘం శిక్షణ ఇవ్వనుంది. ఈ నెల 15న రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులతో ఎన్నికల కమిషనర్‌‌‌‌ నాగిరెడ్డి సమావేశం కానున్నారు. 18న కలెక్టర్లు,ఎస్పీలతో సమావేశం కావాలని ఇప్పటికే నిర్ణయించారు. జిల్లా ఉన్నతాధికారులతో సమావేశంలో ఎన్నికల తేదీలపై స్పష్టత వచ్చే అవకాశముంది. మూడు విడతల్లో రాష్ట్రంలో 32 జిల్లా పరిషత్‌ లు, 535 మండల పరిషత్‌ లకు ఎన్నికలు నిర్వహించ నున్నారు. వారం రోజుల్లోగా షెడ్యూల్‌‌‌‌ విడుదల చేసి ఈనెల 23న తొలి విడత పోలింగ్‌‌‌‌కు నోటిఫికేషన్‌‌‌‌ విడుదల చేసే అవకాశమున్నట్టు సమాచారం.

 

SOURCE  : GULTE

12 Apr, 2019 0 42
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
రాజకీయ వార్తలు సినిమా వార్తలు క్రీడ వార్తలు వ్యాసాలు