సూపర్ స్టార్ ని సైతం వదలని కంగన
విభాగం: సినిమా వార్తలు
kangana-clash-with-hrithik-again_kuwait

స్టార్లు .. సూపర్ స్టార్లు సైతం ఆవిడ నోటికి ఝడవాల్సిందే. ఆమె తన శత్రువులకు కంటిపై కునుకుపట్టనివ్వదు. వ్యక్తిగతంగా టార్గెట్ చేసినా.. వృత్తిగతంగా టార్గెట్ చేసినా గొడవ హై లెవల్లోనే ఉంటుంది మరి. స్టార్ డైరెక్టర్లు.. స్టార్ హీరోలు అనే తేడా లేకుండా ఇటీవల ఎవరినీ విడిచిపెట్టకుండా ఝడిపించేస్తున్న ఆవిడ ఎవరు? అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. క్వీన్ కంగన గురించి ఈ ఇంట్రడక్షన్.

 

సూటిగా ఉన్న మాట అనేయడం ఆవిడ పద్ధతి. అలా ఎందరినో ఇప్పటికే నానా రకాలుగా ముప్పుతిప్పులు పెట్టింది. నటవారసుల్ని .. స్టార్ హీరోల్ని ఓ ఆటాడుకుంది. ఇక కంగన - హృతిక్ రోషన్ మధ్య గొడవ గురించి తెలిసిందే. క్రిష్ 3 రిలీజ్ తర్వాత ఆ ఇద్దరి మధ్యా రకరకాల ఎపిసోడ్స్ నడిచాయి. వివాదం కోర్టుల వరకూ వెళ్లడం ప్రధానంగా చర్చకు వచ్చింది. అయితే అదంతా ఒక సైడ్ అనుకుంటే.. ఇప్పుడు క్వీన్ కంగన తన శత్రువుల్ని వేరొక రకంగానూ వెంటాడుతోంది. ప్రొఫెషనల్ గానూ ఇప్పుడు ఢీ అంటే ఢీ అంటోంది. ఈ వార్ లో ఫస్ట్ కోటింగ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ కే.

డీప్ గా మ్యాటర్ లోకి వెళితే హృతిక్ నటిస్తున్న సూపర్ 30 ఈ ఏడాది జూలై 26న రిలీజ్ తేదీని ఫిక్స్ చేశారు. వాస్తవానికి జనవరి 25న రిలీజ్ చేయాల్సిన ఈ చిత్రాన్ని ఈ కొత్త తేదీకి వాయిదా వేశారు. అయితే అదే రిలీజ్ తేదీకి కంగన పట్టుబట్టి మరీ తన సినిమా `మెంటల్ హై క్యా`ని రిలీజ్ చేస్తుండడం ప్రముఖంగా చర్చకు వచ్చింది. ఓవైపు హృతిక్ నటిస్తున్న సినిమా ఆరోజు వస్తుందని తెలిసీ కంగన ఇలా పోటీకి దిగడం పై ఆసక్తిగా ముచ్చటించుకుంటున్నారంతా. సూపర్ స్టార్లను సైతం క్వీన్ వదిలిపెట్టదా?  ఇలా పంతానికి దిగుతుందా? అంటూ ఫ్యాన్స్ లో ఒకటే గుసగుసలు వినిపిస్తున్నాయి.

కంగన - రాజ్ కుమార్ రావు ప్రధాన పాత్రల్లో ప్రకాష్ కోవెలమూడి తెరకెక్కిస్తున్న `మెంటల్ హై క్యా` ఫస్ట్ లుక్ పోస్టర్లకు అద్భుత స్పందన వచ్చింది. ఈ సినిమాని జూన్ 21న రిలీజ్ చేయాలని భావించారు. కానీ బిజినెస్ వర్గాల ఒత్తిడి మేరకు వాయిదా వేస్తూ తాజాగా కొత్త తేదీని ప్రకటించారు. వేరొక స్టార్ నటించిన సినిమా వస్తోందని తెలిసీ అదే తేదీని లాక్ చేయడానికి కారణం ట్రేడ్- పంపిణీ వర్గాల సంబంధ విషయాలేనంటూ మెంటల్ హై క్యా వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఈ సినిమాని బాలాజీ టెలీఫిలింస్ అధినేత్రి ఏక్తా కపూర్ నిర్మిస్తోంది. రిలీజ్ విషయమై సదరు కంపెనీ నిర్ణయం తీసుకుందని అధికారికంగా ప్రకటించారు. అయితే మేల్ వరల్డ్ పై ఫీమేల్ ఈగోయిస్టుల (కంగన- ఏక్త) దాడి ఇదని మరోవైపు సామాజిక మాధ్యమాల్లో అప్పుడే చర్చ మొదలైంది. నిజానికి డిస్ట్రిబ్యూటర్లు చెబితేనే అప్పటికి వాయిదా వేశారా?  లేక శత్రువుతో ఠగ్ ఆఫ్ వార్ నడిపించేందుకు కంగననే ఇలా ప్లాన్ చేసిందా? అన్నదానికి కాలమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. మరోవైపు కంగన & ఏక్త డెసిషన్ ఏదైనా హృతిక్ రోషన్ - సూపర్ 30 టీమ్ మాత్రం తాము తొలుత ప్రకటించిన రిలీజ్ తేదీ జూలై 26కే స్టిక్ అయ్యి ఉన్నామని అధికారికంగా ప్రకటించడం వార్ కి తెర తీసింది. ప్రస్తుతం ఆ ఇద్దరి మధ్యా వార్ ఆఫ్ యారోస్ పై మరోసారి ఆసక్తికర డిబేట్ మొదలైంది. 

 

SOURCE : TUPAKI

08 May, 2019 0 53
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
రాజకీయ వార్తలు సినిమా వార్తలు క్రీడ వార్తలు వ్యాసాలు