పవనయ్యా ఇదేమి బాగోలేదయ్యా
విభాగం: రాజకీయ వార్తలు
janasena-succeeds-in-zero-budget-politics,but-ap-people-failed_kuwait

ఇదుగో పవనయ్యా ప్రజలకి మీలాంటి రాజకియ నాయకులు అక్కరలేదయ్యా. వైజాగ్ లో కేంద్ర ప్రభుత్వ సంస్త డీ.సీ.ఐ ప్రవేటీ కరణకి వ్యతిరేకంగా గళం విప్పావు, ఉద్యమాలకి మద్దతు పలికావు, ఎవరి క్రుషి వల్లైతే ఏమి కేంద్రం ప్రవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. పైకి అంతా బాగానే ఉంది, మన ప్రజలకి మంచోడు కాదు ముంచేటోడు కావాలి, నువ్వు ప్రజలకి చేసింది మర్చిపోయారు. మీకు ఇక్కడ రాజకీయంగా లాభం కన్నా నష్టమే ఎక్కువ జరిగింది, ప్రజల ముందు నటించకుండా ప్రజల కోసం పోరాడటం కేంద్రానికి నచ్చలేదు, ఈ పవనెవడు ఏపీలో కంటిలో నలుసులా తయారయ్యాడు అనుకున్నారు. చంద్రబాబు, జగన్ లని పుత్రుడు, దత్త పుత్రుడిలా చేసుకుని విభజన హామీలు తుంగలో తొక్కి నియంతలా ఏపీని ప్రధాని మోడీ అణిచేస్తే మీరు మాత్రం లొంగక కంటిలో నలుసులా తయారయ్యారు. 

ఇదే కాదు, ప్రత్యేక హోదా కాదు ప్యాకేజీ ఇస్తాము అంటే తిరస్కరించావు, మోడీకి, అమిత్ షా లకి ఎక్కడో కాలింది. చంద్రబాబు ప్యాకేజీ స్వాగతిస్తే, జగన్ రెడ్డి ప్యాకేజీ కావాలి, హోదా కావాలని సున్నితంగా కేంద్రాన్ని విమర్శించి స్వామి బక్తి చాటుకున్నాడు. ఎంత రాజకీయ అజ్జానివయ్యా పవనయ్యా, ప్రజలకి నటన కావాలి కాని పోరాటం కాదు, ప్రజలని మభ్య పెట్టాలి కాని నిజాయితీగా ఉండకూడదు. 

చంద్రబాబు నాలుగేళ్ళు కేంద్రంలొ భాగస్వామిగా ఉండి, మంత్రి పదవులు తీసుకుని చివరి ఏడాది ధర్మ పోరాటం అని నాటకాలు అడితే జగన్ రెడ్డి మొదటి నుండి కేంద్రానికి అనుకూలంగా ఉండి, వారికి కావలసినప్పుడల్లా మదతిస్తూ, రాష్ట్రపతి, ఉపరాష్ట్ర ఎన్నికల్లో మద్దతిచ్చి, హోదా మీద పోరాటం అంటూనే కేంద్రాన్ని బంతిపూలతో కొట్టి చంద్రబాబుని దుడ్డుకర్రతో కొట్టాడు అదీ రాజకీయం అంటే అందుకే ప్రజలు జగన్ కి పట్టం కట్టారు. పవనయ్యా నువ్వు సినిమాల్లో కాదు రాజకియాల్లో నటించాలయ్యా కేంద్రాన్ని అడిగినట్టే ఉండాలి కాని అడగకూడదు, కొట్టినట్టే ఉండాలి దుడ్డుకర్రతో కాదు బంతిపూలతో కొట్టాలి. 

పవనయ్యా ఇకనైనా మారవయ్యా, ప్రజలని మభ్య పెట్టాలయ్యా., కేంద్రంతో సఖ్యత పెంచుకోవయ్యా, కేంద్రాన్ని ప్రశ్నించినట్టే ఉండాలి కాని సుతిమెత్తగా ప్రశ్నించాలి, రాళ్ళతో కాదు బంతిపూలతో కొట్టాలి రాజకీయం నేర్చుకోవయ్యా, జగన్ రెడ్డిని చూసి నేర్చుకోవయ్యా...

కోనసీమ నుండి గుజరాత్ కి తరలివెళ్తున్న గ్యాస్ లో మన వాటా మనకి కావాలి అన్నావు. పవనయ్యా నువ్వు ఎంత పెద్ద తప్పు చేసావయ్యా? గ్యాస్ జోలికి వస్తే

01 Jun, 2019 0 52
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
రాజకీయ వార్తలు సినిమా వార్తలు క్రీడ వార్తలు వ్యాసాలు