బిగ్ బాస్ 3 ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్
విభాగం: సినిమా వార్తలు
bigg-boss-3-intresting-updates-_kuwait

గత కొన్ని నెలలుగా ఎదురు చూస్తున్న తెలుగు బిగ్ బాస్ మూడవ సీజన్ కు ఏర్పాట్లు చక చక జరుగుతున్నాయి. అతి త్వరలోనే ప్రకటన రాబోతుంది. మొదటి సీజన్ కు ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించగా రెండవ సీజన్ కు నాని హోస్టింగ్ చేశాడు. మూడవ సీజన్ కు పలువురిని పరిశీలించి చర్చించిన తర్వాత నాగార్జున ఫైనల్ అయినట్లుగా తెలుస్తోంది. అయితే ఇంకా ఆ విషయమై అధికారిక ప్రకటన రాలేదు. నాగార్జున 'మన్మధుడు 2' చిత్రంను హడావుడిగా పూర్తి చేస్తున్న నేపథ్యంలో ఆయనే మూడవ బిగ్ బాస్ అని ఎక్కువ శాతం మంది నమ్ముతున్నారు. ఇక ఈసారి పార్టిసిపెంట్స్ విషయంలో చాలా ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నారట.

 

గత సీజన్ లో పార్టిసిపెంట్స్ విషయంలో విమర్శలు వచ్చాయి. సామాన్యులను తీసుకోవడంతో పాటు పెద్దగా ఫేమ్ లేని వారిని ఎంపిక చేశారనే విమర్శలు వచ్చాయి. అందుకే ఈసారి క్రేజ్ ఉన్న సెలబ్రెటీలను మాత్రమే తీసుకోవాలని భావిస్తున్నారు. ఇప్పటికే కొందరి పేర్లు కూడా ఫైనల్ అయ్యాయి. మీడియాలో కొన్ని పేర్లు బయటకు వచ్చాయి. వరుణ్ తేజ్ సోషల్ మీడియా సెన్షేషన్ వైవాహర్ష బిగ్ బాస్ హౌస్ లో ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక హౌస్ కు గ్లామర్ తీసుకు వచ్చేందుకు ముగ్గురు నలుగురు ముద్దుగుమ్మలను కూడా రంగంలోకి దించబోతున్నారు.

గత కొన్ని రోజులుగా ఉదయభాను ఉండబోతుందని వార్తలు వస్తున్నాయి. ఆమెతో పాటు తాజాగా శ్రీముఖి మరియు బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాలా కూడా బిగ్ బాస్ 3 లో ఉండబోతున్నారట. శ్రీముఖి ఇటీవల పటాస్ కు బ్రేక్ తీసుకోబోతున్నట్లుగా ప్రకటించింది. దాంతో పలు కారణాలు మొదట వినిపించాయి. కాని తాజాగా ఆమె బిగ్ బాస్ కోసమే పటాస్ కు బ్రేక్ తీసుకుందనే టాక్ వినిపిస్తుంది. ఇక బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాలా కూడా ఆటతోనే కాకుండా గ్లామర్ తో కూడా స్టార్ డం దక్కించుకుంది. సినిమాల్లో కూడా కనిపించిన అనుభవం ఆమెకు ఉంది. అందుకే ఆమె కూడా తప్పకుండా బిగ్ బాస్ హౌస్ కు గ్లామర్ తీసుకు వస్తుందనే నమ్మకంతో నిర్వాహకులు ఉన్నారు. జూన్ లో బిగ్ బాస్ 3 ప్రకటన వచ్చే అవకాశం ఉంది. జులై లేదా ఆగస్టులో షో ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 

 

SOURCE : TUPAKI

22 May, 2019 0 51
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
రాజకీయ వార్తలు సినిమా వార్తలు క్రీడ వార్తలు వ్యాసాలు