జ‌గ‌న్‌పై ఒత్తిడి పెంచేందుకు అఖిల‌ప్రియ కొత్త స్కెచ్‌
విభాగం: రాజకీయ వార్తలు
bhuma-akhila-priya-to-write-a-letter-to-jagan-everyday_kuwait

టీడీపీ యువ‌నేత భూమా అఖిలప్రియ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో ప‌రాజ‌యం పాలైన అఖిల‌ప్రియ సుదీర్ఘ‌కాలం త‌ర్వాత మీడియాతో మాట్లాడుతూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఏపీ ముఖ్య‌మంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహన్‌రెడ్డి తీరుపై ఘాటుగా స్పందించిన అఖిల‌ప్రియ జ‌గ‌న్‌పై ఒత్తిడి పెంచేందుకు నూత‌న ఎత్తుగ‌డ వేశారు. జ‌గ‌న్ మాట‌ల‌కు చేత‌ల‌కు పొంత లేద‌ని, అందుకే ఆయ‌న‌కు రోజుకో లేఖ రాయ‌నున్న‌ట్లు అఖిల‌ప్రియ సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు.

2014లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో వైస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనూహ్య పరిణామాల నేపథ్యంలో తన తండ్రి భూమా  నాగిరెడ్డి, మావయ్య ఎస్వీ మోహన్ రెడ్డిలతో కలిసి ఆమె సైకిలెక్కేశారు. భూమా నాగిరెడ్డి అకాల మరణం అనంతరం భూమా అఖిలప్రియకు మంత్రి పదవి ఇచ్చి గౌరవించారు చంద్రబాబు నాయుడు. అనంతరం జరిగిన ఉపఎన్నికల్లో సోదరుడు భూమా బ్రహానందరెడ్డికి టికెట్ ఇప్పించుకుని భూమా అఖిలప్రియ గెలిపించుకున్నారు. అయితే, ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నికల్లో  ప్రజలు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడంతో భూమా కుటుంబం ఒక్కసీటు కూడా గెలుచుకోలేకపోయింది. భూమా కుటుంబంతోపాటు కేఈ కుటుంబం, కోట్ల కుటుంబం, టీజీ వెంకటేశ్ కుటుంబాలు సైతం ఈ ఎన్నికల్లో ఘోరంగా ఓటమి చవిచూశాయి. 

కాగా, ఈ ఓట‌మి అనంత‌రం అఖిల‌ప్రియ మీడియాతో మాట్లాడుతూ సీఎంజ‌గ‌న్ మాట‌ల‌కు చేత‌ల‌కు పొంత‌న లేద‌న్నారు. అవినీతి రహితపాలన అందిస్తామని సీఎం జగన్ చెబుతున్నా క్షేత్రస్థాయిలో అధికారులెవరూ ఆయ‌న మాటలు పట్టించుకోవడంలేదని విమర్శించారు. రాష్ట్రంలో ఎక్కడ చిన్న అవినీతి జరిగినా నేరుగా జగన్ కే లేఖల రూపంలో తెలియజేస్తామని అఖిలప్రియ తెలిపారు. ఇక నుంచి సీఎం జగన్ కు ప్రతిరోజు ఓ లేఖ రాస్తానని తెలిపారు. ప్రజావేదికను కూలగొట్టడం సరికాదని అఖిల‌ప్రియ అన్నారు. చంద్రబాబునాయుడు నివాసం పరిసరాల్లో అనాథాశ్రమాలు, ఆసుపత్రులు ఉన్నాయని వాటిని కూడా కూల్చివేస్తారా? అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి అక్రమకట్టడాన్ని కూలగొడితే తాము కూడా హర్షిస్తామని చెప్పారు.

 

SOURCE : GULTE

28 Jun, 2019 0 28
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
రాజకీయ వార్తలు సినిమా వార్తలు క్రీడ వార్తలు వ్యాసాలు