ఇప్పుడు మాత్రం బన్నీ కావాల్సిందే..
విభాగం: సినిమా వార్తలు
allu-arjun-as-chief-guest-for-taxiwala-prerelease-event_kuwait

కొన్ని నెలల కిందట ‘గీత గోవిందం’ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ జరిగింది. దానికి అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా వచ్చాడు. నిజానికి అప్పుడు విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్.. ‘గీత గోవిందం’కు ఉన్న హైప్ ప్రకారం చూస్తే బన్నీ దానికి అతిథిగా రావాల్సిన పనే లేదు. బన్నీ అని ఏంటి.. అసలు ఏ హీరో కూడా వచ్చి సినిమాను ప్రమోట్ చేయాల్సిన అవసరం లేకపోయింది. ఆ ఈవెంట్ కంటే ముందే ‘గీత గోవిందం’ హైప్ తార స్థాయికి చేరుకుంది. పైగా తన ఈవెంట్లలో విజయ్ చేసే విన్యాసాలకు వేరే వాళ్ల అవసరమే ఉండదు. అతనే జనాల్ని బాగా ఎంగేజ్ చేస్తుంటాడు. కానీ కొన్ని నెలల్లో పరిస్థితి మారిపోయింది. ‘నోటా’ డిజాస్టర్ కావడం.. ఎంతో నెగిటివిటీ మధ్య ‘ట్యాక్సీవాలా’ రిలీజవుతుండటంతో ఇప్పుడు మాత్రం దీని ప్రమోషన్‌కు పెద్ద స్టార్ తప్పక రావాల్సిందే. ఆ అతిథి బన్నీనే అయ్యాడు.

నవంబరు 11న ఆదివారం హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్లో ‘ట్యాక్సీవాలా’ ప్రి రిలీజ్ ఈవెంట్ జరగనుంది. దీనికి బన్నీనే ముఖ్య అతిథిగా వస్తున్నాడు. ఈ చిత్ర నిర్మాత ఎస్కేఎన్‌కు బన్నీ సన్నిహితుడు. నిర్మాతగా అరంగేట్రం చేస్తున్న అతడి కోసమే బన్నీ వస్తున్నాడు. ఈ చిత్రంలో గీతా ఆర్ట్స్ భాగస్వామ్యం కూడా ఉన్న సంగతి తెలిసిందే. ‘నోటా’తో విజయ్ క్రేజ్ తగ్గడంతో పాటు ‘ట్యాక్సీవాలా’ చుట్టూ బోలెడంత నెగెటివిటీ ఉంది. ఈ చిత్రం వాయిదాల మీద వాయిదాలు పడి ఎట్టకేలకు రిలీజవుతుండగా.. ఆశించిన బజ్ రాలేదు. ఈ నేపథ్యంలో బన్నీ లాంటి స్టార్ వచ్చి ఈ చిత్రానికి కొంచెం మైలేజి ఇవ్వాల్సిన అవసరముంది. బన్నీ తర్వాతి సినిమా విషయంలో సస్పెన్స్ నడుస్తున్న నేపథ్యంలో ఈ ఈవెంట్లో ఏమైనా ప్రకటన చేస్తాడేమో అన్న ఆసక్తి కూడా జనాల్లో ఉంది. కాబట్టి బన్నీ రాక ఈ ఈవెంట్‌కు ప్రత్యేక ఆకర్షణ అవుతుందనడంలో సందేహం లేదు.

 

 

 

SOURCE:GULTE.COM

10 Nov, 2018 0 99
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
రాజకీయ వార్తలు సినిమా వార్తలు క్రీడ వార్తలు వ్యాసాలు